పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0171-6 కేదారగౌళ సంపుటం: 07-422

పల్లవి:
కాఁక నీవు రేఁచఁగాను కన్సవారినేల దూరీ
వీఁకపుఁగోరికతోడ విఱవీఁగిని

చ.1:
కోమలి నిన్నుఁబాసి కోవిలకూఁతలు విని
వేమరు కోపానవుంట వింట వేసీని
ఆమని చిగురు చూచి అంతలోనే వేసారి
దోమటికొనగోరి కత్తులు చాఁచీని

చ.2:
వెన్నెల తేటలు చూచి విసుగుచు వెళ్ళఁజల్లీ
కిన్నెరరాయల ముంచి కిమ్ములకును
తిన్నని మేఘము చూచి తిట్టుచు నీరెల్లఁగార
సన్నపుటల్లీకామల చాఁచి పిలిచీని

చ.3:
తుమ్మెద మూఁకలఁ జూచి దూరుచు తురుములోని
కొమ్మ సంపెంగ విరులఁ గొని వేసీని
నెమ్మది శ్రీ వెంకటేశ నీవింతలోఁ గూడఁగాను
కమ్మి మరుబలములఁ గని నవ్వీని