పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0171-3 శుద్దవసంతం సంపుటం: 07-419

పల్లవి:
ఇద్దరిభావములును యీడు జోళ్ళాయ నిదె
అడ్డుకొని తులఁదూఁగినట్టి చందమాయను

చ.1:
తళుకున నీ విప్పుడు తరుణిఁ జూచితేను
తొలఁకి చెక్కుచెమట దొరుగఁజొచ్చె
లలి మీరి ఆ మెరుపులకు యీ తురుము మేఘ
మలరి వానగురిసినట్టిచందమాయను

చ.2:
చదురుమాఁటల నీవు జలజాక్షిఁ బిలిచితే
పాదిగొని నిలువెల్ల బులకించెను
కదిసి ఆమాఁటలగాలికి యీమైఁదీగె
అదనుగూడ ననిచినట్టిచందమాయను

చ.3:
ననుపై శ్రీ వెంకటేశ నవ్వి నీవు గూడితేను
యెనసి కామినిచిత్తమెల్లఁ గరఁగె
వొనరి ఆవెన్నెలకీమనసనే చంద్రకాంత
మనువుగాఁ గరఁగినయట్టి చందమాయను