పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0171-2 పాడి సంపుటం; 07-418

పల్లవి:
ఎరిఁగిన పనులకు యేఁటికి నింక
నెరవాదై మెరసేది నీగుణమే కా

చ.1:
సెలవి నవ్వఁగనేమి చెక్కు నొక్కఁగానేమి
నెలకొని కరఁగేది నీమనసే కా
బలిమి సేయఁగనేమి పైకొని మొక్కఁగనేమి
నిలిచి సత్యమాడేది నీనాలికేకా

చ.2:
బెట్టువెనఁగఁగనేమి ప్రియము చెప్పఁగనేమి
నెట్టుకొని వుండేది నీతనువే కా
యిట్టట్టనఁగానేమి యెదుటనుండఁగనేమి
నిట్టుచూపు చూచేవి నీకన్నులే కా

చ.3:
సమ్మతించఁగా నేమి సంగడికి రాఁగానేమి
నెమ్మది చెవుల వినేది నీతగవేకా
యిమ్ముల శ్రీ వెంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
నిమ్మలము సేసేది నీకరుణే కా