పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0107-5 హిందోళ వసంతం సంపుటం: 07-041

పల్లవి:
ఏమనేవే యీతగవులిందరూ నెఱఁగరా
కోమలపు మగవాఁడు కొలఁదులెఱుఁగునా

చ.1:
వరుసలంతా సరే వలపే యెక్కుడు గాని
గరిమెల నీవేల కాఁతాళించేవే
పురుషుఁడు నాతఁడే భోగింవే వారి భాగ్యము
మరిగించి కలిసితే మఱి చలివాయదా

చ.2:
సవతులంతా సరే చనవే యెక్కుడు గాని
వివరించుకొనకేలే వేగిరింపులు
కవగూడి (డే?) వాఁడొకఁడే కలసే వారి నేరుపు
చివురు బలిసితేనే చేఁగలై నిలువవా

చ.3:
కళలూనంతా సరే కరఁగేదెక్కుడు గాని
పలువూరు నీవేల పంతమాడేవే
అలమె శ్రీ వేంకటేశుఁడంటిన మావోడఁబాటు
తొలుత మీనవ్వులెల్లా దొతులకునెక్కవా