పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0171-1 శంకరాభరణం సంపుటం: 07-417

పల్లవి:
చెలులాల యీ భావము చెప్పఁగ నలవిగాదు
వలపుల పంటవండి వలసినట్టున్నది

చ.1:
వనితచెక్కుచేతితో వజ్రాలకమ్మ వొరయ
ఎనసి చింతించే భావమెట్లున్నది
ఘన తాప సూర్యుఁడును కమలాబాణమును
తనపై దండెత్త నేకాంతమాడినట్టున్నది

చ.2:
పమ్మిన నిట్టూర్చులు పళ్ళెపుమోవినొరయ
యిమ్ములఁ గందినభావమెట్టున్నది
చిమ్మిరేఁగి చల్లగాలి చిగురుటడిదమును
కొమ్మను సాదించ పొత్తుగూడినట్టున్నది

చ.3:
దిట్టు శ్రీ వెంకటేశురతివేళ కాంతకు
యిట్టె బొమ్మలపైఁ గురులెట్టున్నది
తొట్టి మరువిండ్లును తుమ్మిదలు యీకెతోడి
చుట్టురికానకు వచ్చి జోడైనట్టున్నది