పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0170-6 దేశి సంపుటం: 07-416

పల్లవి:
వింతగా నానతీవయ్య వినే నేను
పంతానఁ దాను విన్నపము లెట్టుసేసెను

చ.1:
సెలవుల నవ్వుతాను చెక్కుగోర గీరుతాను
మలసి నీతో నాకె మాఁటలాడెను
వలపులు చల్లుతాను వడిఁగొప్పు దువ్వుతాను
సాలసి మరేమని సుద్దులెల్లాఁ జెప్పెను

చ.2:
సిగ్గులు నెరపుతాను చెమట దుడుచుతాను
దగ్గరక యేమికతలు చెప్పెను
అగ్గలమై మొక్కుతాను ఆయములంటుతాను
తగ్గక యంతవడి తలపోసుకొనెను

చ.3:
సురటి విసరుతాను సొమ్ములు చక్కఁబెట్టుతా
అరసి కౌఁగిటనే ప్రియము చెప్పెను
ఇరవై శ్రీ వెంకటేశ యిట్లు నన్నుఁ గూడితివి
నిరతి నీచుట్టుమేల నిన్నాడఁబరచెను