పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0170-5 దేసాళం సంపుటం: 07-415

పల్లవి:
అందుమీఁదనాలఁ గాచేవతి మంకుఁ దనము
సందుల వంకలొత్తితే చాయకు వచ్చీనా

చ.1:
వెన్నతోఁ బెట్టిరి నీకు వేడుక కారితనము
చిన్ననాఁడె గొల్లెతలు చెప్పఁగనేల
పన్ని కడమ దొడమ పాలలో నూరి పోసిరి
సన్నల బుద్ది చెప్పితే చక్కనుండేవా

చ.2:
పెరుగుతోడఁ బొదిగి పెట్టిరి దుష్టుఁదనము
పెరుగఁ బెరుగ నాఁడె ప్రియురాండ్లెల్లా
నిరతిని వలపులు నేతితో లోనికిచ్చిరి
వొరసి నేనేమనినా వోజకు వచ్చేవా

చ.3:
మోవితేనెలోఁ బెట్టిరి మోహపునాలితనము
శ్రీ వెంకటేశ్వర నాఁడె చెలులెల్లాను
కూవలుగా నేరుపులు గుబ్బలలో హత్తించిరి
యీవల నన్నుఁ గూడితి విఁక నెడసేవా