పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0170-4 పాడి. సంపుటం; 07-414

పల్లవి:
ఎవ్వరికిఁ దమసామ్ములెంత తీపులో
నివ్వటిల్ల మీవంక నెరసె నీసుద్దులు

చ.1:
ఈకడ'నింత కంఠపు టెలుఁగుఁ గోవిలలకు
మేకొని చిగురాకులు మేపినయట్లు
ఆకుమడిచి మడిచి అంది నీవియ్యఁగాను
దాకొని చిగురుటడిదము దాఁచె మరుఁడు

చ.2:
నెలకొని యీ వనిత పలుకుఁ జిలుకలకు
యెలమి బింబ ఫలములిచ్చిన యట్లు
పలుమారు నీమోవిపండు చవిచూపుఁగాను
కలపండ్లు గోటరానఁ గప్పెను వసంతుఁడు

చ.3:
కందువతో నీమగువకనుఁజకోరములకు
అంది వెన్నెల విందులానించినట్లు
చెంది శ్రీ వెంకటేశుఁడ చిరునవ్వు నవ్వఁగాను
యెందువెంటఁదిప్పికళ లిదివోచందురుఁడు