పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0170-2 వరాళి సంపుటం: 07-412

పల్లవి:
ఆతఁడేమి నీవేమి అవుఁగాములిందులోనేమి
కాతరపుఁ దమకము కలదె యిద్దరికి

చ.1:
మించుఁదేనె పెదవిపై మిరియాలు చల్లుదురా
పంచదార చల్లుదురు పైపైఁగాక
మంచిమాటలాడవే మరి వెంగేలేమిటికే
కంచపుఁబొత్తువలపు కలసెనిద్దరికి

చ.2:
కలువకన్నుచూపుల కాఁకలు చల్లుదురా
చలువవెన్నెలతేట చల్లుటగాక
కలయ సన్నసేయవే కడు జంకించనేఁటికే
కలికి సిగ్గులపాత్తు కలదె యిద్దరికి

చ.3:
పచ్చిగుబ్బలటు చూపి పంతాలు చల్లుదురా
కొచ్చి మెరుఁగులు చల్లఁగూడుఁగాక
ఇచ్చట శ్రీ వెంకటేశునెనసితివి రట్టేల
గచ్చుల వీడేలపాత్తుకలదె యిద్దరికి