పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0169-6 సాళంగనాట సంపుటం: 07-410

పల్లవి:
రావయ్య చూతువుగాని రమణిలాగు
దైవార నిన్నే మతిని దలఁచినట్టున్నది

చ.1:
వెలఁది నిన్నుఁబాసి విరహగ్నిచం గాంగి
వొలిసి కేళాకూళిలో నోలలాడఁగా
వలరాజుకరవాలు వసంతుఁడనేటి కమ్మరి
పెలుచుగ వాఁడిపదను పెట్టినయట్టున్నది

చ.2:
సతి నీపై తమకాన చంద్రకాంత శిల మీఁద
ఇతవుగాఁ బవళించి యింపాందఁగా
రతిరాజు నిజ కీర్తి ప్రతిమఁ జంద్రవిథాత
తతి మెరుఁగువెట్టితే తళుకున్నట్టున్నది

చ.3:
ఇంతి నీవు గూడేటప్పుడెడలేని పూదండలు
చెంతలఁ జుట్టుకొనఁగా శ్రీ వేంకటేశ్వరా
కంతుని తోఁట పూఁదీగె గాలియనే దోహళజ్ఞఁ
డంతటఁ బుట్టించఁ జేసినటువలెనున్నది