పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

{{left margin|5em}]
రేకు: 0169-5 నాదరామక్రియ సంపుటం; 07-409

పల్లవి:
ఇంకానేఁటికి జోలి యిదె నీ భాగ్యమాయ
పొంకపు రతుల నిట్టె భోగించవయ్యా

చ.1:
మదిరాక్షి చన్నులనే మందర గిరులు మోవ
చెదరని యారనే శేషునిఁ బూఁచి
ముదమున లావణ్య సముద్రము మరుఁడు దచ్చె
అదె అధరామృతము అవధరించవయ్యా

చ.2:
అతివమోముఁజంద్రుఁడనేటి సానబిల్లకు
తతి జడియనేటి సూత్రము చుట్టి
అతనుఁడు చూపులయమ్ములు సానఁబట్టితే
సతమై మోహపుఁబొడి సారె రాలీఁ గోవయ్యా

చ.3:
పడఁతిపిరుఁదనేటి బండికండ్లతోడను
తొడలనే కలహంస నడలఁ గట్టి
యెడయక శ్రీవేంకటేశ నిన్నెక్కించె మరుఁ
డడరి వలపు బండ్లవచ్చె నీకయ్యా