పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0169-4 కేదారగౌళ సంపుటం: 07-408

పల్లవి:
ఇద్దరి భావములును యెంచగ నలవిగావు
వొద్దికలై సింగారాలు వొడ్డినయట్లుండెను

చ.1:
చెలువపు రమణుఁడు చెమట పైఁ జిమ్మితేను
జలజలఁ జెమరించి సకి యెట్లుండె
నెలవై లావణ్య జలధిలో స్వాతి వానచే
బలిసి ముత్యాల పంట వండినట్లుండెను

చ.2:
సరసపు నాయకుఁడు జాజి మొగ్గలు వేసితే
తరుణి మైపులకించి తానెట్టుండెనెే
మరిగి పాయపుచేన మన్మథాస్త్రపు మొలక
పారి వసంతుఁడు చల్ల పొదలినట్లుండెను

చ.3:
శ్రీ వెంకటేశ్వరుండు చెంది మోవి యిచ్చితేను
యీ వనితమోము కళ యెట్టుండెనే
పోవులై మోహపు నిండుఁబున్న మనమృతముబ్బి
ఆవేళఁ జంద్రకళలానినయట్లుండెను