పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0169-3 శ్రీరాగం సంపుటం: 07-407

పల్లవి:
చిత్తజు వేఁడుకొనరే చెలియలాల
తత్తరించి పతిమీఁది తలపోఁతనున్నది

చ.1:
అతివవై మదనుఁడు అనలాస్త్రమేయఁబోలు
కతలుగ విరహగ్నిఁ గాఁగీనదే
యితవుగా వరుణాస్రమేయఁబోలునప్పటిని
తతిఁ జెమటవానలఁ దడియుచునున్నది

చ.2:
అమరగ నంతలో వాయవ్యాస్తమేయఁబోలు
వుమరఁబడి నిట్టూర్చులొగి రేఁగెను
జమళిఁ గూడఁగ నట్టె శైలాస్త్రమేయఁబోలు
భ్రమసి చనుఁగొండలు బాయిటఁ గాన్సించెను

చ.3:
మునుకొని పంతాన సమ్మోనాస్త్రమేయఁబోలు
మనసు పరవశాన మరపందెను
అనిశము రక్షగా నారాయణాస్త్రమేయఁబోలు
ఘన శ్రీవేంకటేశుఁడు కాఁగిటిలోఁ గూడెను