పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0169-1 మధ్యమావతి సంపుటం: 07-405

పల్లవి:
మించెనివె సింగారాలు మెలుఁతలాల
పంచబాణు సవరణ పరగినయట్లు

చ.1:
నలినాక్షి కన్నుల నడుమనీనాసికము
చెలఁగి యమరెనె వోచెలులాల
కలువల బొమ్మవిండ్లఁ గంతుఁడేయఁగాఁ జూచి
యెలమి సంపగపవ్వు యెడచొచ్చినట్లు

చ.2:
ముదిత కుచాంతరమునను యీరోమరాజి
అదివో యంత చూపట్టె నంగనలాల
కదిసి పెట్టలు గుండ్లు కంఠనాళమున మరుఁ
డెదిగించఁ బొగబాణమెడచొచ్చినట్లు

చ.3:
శ్రీసతి పిరుఁదుచెంత శ్రీ వెంకటేశునురము
ఆసరినెట్టుండెనో అంగనలాల
రాసి మధ్యరంగానఁ జక్రాలు మరుఁడొనరింప
యీసుదీర హరిగె దానెడచొచ్చినట్లు