పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ర్వ్కు: 0168-6 బౌళిరామక్రియ సంపుటం: 07-404

పల్లవి:
ఇందుకే నేఁ జింతించేను యెటువలెనున్నాఁడవో
సందడిపెండ్లిండ్లాయ సరుస నీబతుకు

చ.1
చెంతలనాపే నీపైఁ జెలు చాఁచఁగాను

వంతుకుఁ జెయి చాఁచితినివ్వల నేనుండి
యింతుల మిద్దరమును యిరువంకలానుండఁగా
సంతకూటమాయను చక్కని నీమేను

చ.2:
ఆకడనాకె నీకు నాకుమడిచియ్యఁగాను
యీకడ నేనూ నీకునిచ్చితినిట్టే
కైకొని యిద్దరునూడిగము నీకుఁ జేయఁగాను
కాకువడి కలగూరగంపాయ నీనోరు

చ.3:
గక్కన నాపె నిన్నుఁ గాఁగిటఁ గూడఁగాను
వొక్కటై నేనూనట్టి వొనరఁగాను
యిక్కువ శ్రీ వెంకటేశ యెనసి యిద్దరివల్లా
అక్కర నురిపేకళ్ళమాయను నీవురము