పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0168-3 ఆహిరి సంపుటం: 07-401

పల్లవి:
వద్దు చలమింతటను వనిత గావఁగరాదా
ముద్దసేసి తమకము మూలఁబెట్టకొనేవా

చ.1:
కోరికలు పెడరేఁచి గుట్టుననున్నాఁడవు
ఆరీతినలయింతురా ఆఁటదానిని
రారాదా యిఁకనైనా రమణిపానుపుపైకి
వూరనిచ్చి విరహము వుట్టిఁగట్టేవా

చ.2:
చెమటపుట్టఁ జెనకి సిగ్గుననున్నాఁడవు
చిమిడింతురా మనసు చెలియకును
జమళినింతిచన్నుల సాములు సేయఁగరాదా
వుమరఁబెట్టి వలపు వొడినించుకొనేవా

చ.3:
కాఁగిలించి కరఁగించి కన్నులు మూసుకొనేవు
దాఁగిలిముచ్చిమేఁటికి తరుణితోను
వీఁగక శ్రీవేంకటేశ వెలఁదిఁ గూడితివిట్టే
మాఁగనిచ్చి మోవితేనె మరిఁ గొసరేవా