పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0168-2 నాదరామక్రియ సంపుటం; 07-400

పల్లవి:
ఇందుకేల వలచితి మింతులము
పందెపు మరు పూబంతులము

చ.1:
మలకలయిన నీమాటలు
యెలయింపులకును యేటలు
పలుమరుఁ బాడేటి పాటలు
తెలిగన్నులకును తేటలు

చ.2:
నడుమంత్రపు నీనగవులు
తడవినవారికి తగవులు
బెడిదపుఁ జూపుల బిగువులు
యెడయనియాసల యెగువదిగువలు

చ.3:
కలయ నీకాఁగిటి కరఁగులు
తెలియఁగలుగు రతితెరఁగులు
కలసితి శ్రీ వేంకటపతి ననునిటు
మలసిన మర్మపు మరఁగులు