పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0168-11 మాళవిగౌళ సంపుటం: 07-399

పల్లవి:
ఇంకనేల వట్టిజోలి యిందులోనే వున్నది
తెంకినే ఆపెకిన్నియుఁ దెలుపఁగరాదా

చ.1:
కన్నుచూపె వాండ్లెతే కడునొడ్డించుకోనేది
వెన్నెలలే వేండ్లెతే విచారమేది
కన్నె నిన్నుడుగుమనెఁ గరుణించి యిఁకను మా
విన్నపము వినాడకు విచ్చేయరాదా

చ.2:
నవ్వులే నాములెక్కితే నయమైన మందులేవి
పువ్వులే పోటుకువస్తే బుద్ధులేవి
జవ్వనిట్టె ఆడుమనె సముకమే యిద్దరికి
దవ్వులేల యించుకంత దగ్గరి రారాదా

చ.3:
చల్లగాలి పగలైతే సందిమాటలిఁకనేవి
వల్లెతాడు వలపైతే వద్దననేది
ఇల్లిదె శ్రీ వేంకటేశ యింతి నీకుఁ జెప్పించె
లొల్లిఁ గూడితివిఁకను లోననుండరాదా