పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0167-6 ముఖారి సంపుటం: 07-398

పల్లవి:
చెప్పుమని యడిగినఁ జెప్పదు మాతోనిదె
చొప్పులు నీకె తెలు సోదించుకోవయ్యా

చ.1:
చిత్తరుపటము చూచి చెలి లోలోఁ దలవూఁచి
చిత్తడిచెమటతోడ సిగ్గువడెను
యిత్తల నీవందులోన నేమి వ్రాసితివో కాని
అత్తి నీవాపనే యింకానడుగవయ్యా

చ.2:
బొమ్మలపెండెము చూచి పాలఁతి యేమీననక
వుమ్మడినే నవ్వునవ్వుచున్నది యిట్టే
చిమ్ములనేమిభావాలు సేయించితివందులోనె
నెమ్మదినందలిమేలు నీవడుగవయ్యా

చ.3:
పట్టినసురటి చూచి పడఁతి శ్రీ వెంకటేశ
గట్టతమకాన నిన్నుఁ గాఁగిలించెను
గుట్టుననందేమి మేకులు గడించితివో
అట్టునిటునా పెతలఁపడుగవయ్యా