పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0167-5 సామంతం సంపుటం: 07-397

పల్లవి:
ఇల్లాలైనదానికి యివి గుణాలా
మెల్లనె గుట్టుతోడనె మెరతురు గాక

చ.1:
కాతరించి సారె సారెఁ గడు సరసమాడేవు
ఆతనికి నీవు దొల్లి ఆలవా యేమి
యేతుల మాటలాడి యిట్టె నవ్వించేవతని
జాతిక ర్తవా నీవు జాణతనాలాడను

చ.2:
సముకాన నీవిట్టే చనవులు నెరుపేవు
తమితోడఁ బోరానిచుట్టుమవా యేమి
చెమటలు గారఁగాను సేవలెల్లాఁ జేసేవు
అమరఁగ నూడిగపు అంగనవా యీడను

చ.3:
పతివద్దనందరికి పనులెల్లాఁ జెప్పేవు
సతతమునదికారిసానివా నీవు
తతి శ్రీ వెంకటేశుఁడు తగ నన్నుఁ గూడె నేఁడు
కతకారిదానవా చక్కటులు చెప్పఁగను