పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0167-3 వరాళి సంపుటం: 07-395

పల్లవి:
ఉపకారముచేయుట ఊహించుకోవద్దా
కపటము గలిగితే కాదనుటగాక

చ.1:
చన్నులమీఁదిపయ్యద జారఁదీసీనంటాను
కన్నుల జంకించేవు కాంతుని నీవు
వున్నతపు జక్కవలు వుమ్మడిఁజిక్కివుండఁగాను
యెన్నఁగ బాయిట వేయుటెగ్లా యిది

చ.2:
కొప్పు సంపెంగ పువ్వులు కుమ్మరించెనంటాను
అప్పుడె యాతని దూరేవౌనే నీవు
తప్పకుండా నెరితుమ్మెదలకును జిక్కకుండా
వొప్పుగాఁగ దులుపుట వుచితము గాదా

చ.3:
మునుకొని నీపోకముడి విడిచెనంటాను
యెనసి శ్రీ వెంకటేశునేల తిట్టేవే
ఘనకరికుంభములు కట్టుగాడినుండఁగాను
కని మరఁగు దీయుట కడు నేర్చు గాదా