పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0166-2 బౌళిరామక్రియ సంపుటం:07-394

పల్లవి:
ఇంతిరో నీపతిని నీవేమి సేసినానే మాయ
కాంతునివద్దికి రావే కడు సిగ్గులేఁటికి

చ.1:
కూడి వున్నవోటను కుచ్చితము వద్దుగాని
ఆడరానిమాట లన్నీ నాడవచ్చును
వేడుకే కలిగితేను వేసరుకోవద్దుగాని
జాడతోడ బొమ్మలను జంకించవచ్చును

చ.2:
కూరిమిగల పట్టున గుట్టుసేయవద్దుగాని
నారుకొననెంతైనా నవ్వవచ్చును
మేరతోడిపాందులకు మేకు చూపవద్దుగాని
బీరపు సమ రతులఁ బెనఁగఁగ వచ్చును

చ.3:
చనవుగల యెడను చలములు వద్దుగాని
వెనుకొని విరులను వేయవచ్చును.
చెనకి నన్నిదె కూడె శ్రీ వెంకటేశుఁడు
పానుఁగఁగ వద్దుగాని ని భోగించవచ్చును