పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0166-5 శ్రీరాగం సంపుటం; 07-391

పల్లవి:
ఏమి గావలెనో నీకు నిదివో ఆపె
ఆముకొని చక్కఁజూడవయ్యా నీవిపుడు

చ.1:
సాలసి సొలసి నిన్నుఁ జూచినల్లాడనుండి
కలువ రేకుల నుండి కన్నులాపె
పిలిచీనప్పటి నిన్నుఁ బేరుకొని సారెసారె
నలిరేఁగి సెలవుల నవ్వులాపె

చ.2:
సందడిలోననె నీకు సన్నలుసేసీఁ దాను
పాందుల నీమేనమామపోలికలాపె
కందువలనుండి పోఁకకాయలను నిన్నువేసి
చిందెడి చెక్కులమీఁదిచెమటలాపె

చ.3:
చిత్తజకేలికినిట్టె చేతులుచాఁచీ నీపై
కొత్త కొత్త మెరుఁగుల గుబ్బలయాపె
యిత్తల శ్రీ వెంకటేశ యేలితివి నన్నునేఁడు
పాత్తుగలసీ నీతో పోరచి యాపె