పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0166-4 నాదరామక్రియ సంపుటం; 07-390

పల్లవి:
మన్నించి నన్నేలుకోర మచ్చిక తోడ
యిన్నిటా జాణఁడవు నన్నిట్టె యీడ

చ.1:
మక్కువతో నీకుఁగొంటి మరులు
వెక్కసమై రాలీఁ గొప్పువిరులు
కక్కసించీ మరునంపగరులు
యిక్కువఁ జెయిచాఁచర యివె కుచ గిరులు

చ.2:
పాదలెను మనలోని పొందులు
సదరాన నదరీ నీసందులు
మదమెత్తించీ వీడేల మందులు
పెదవిపై నివె నీకు పెరతేనెవిందులు

చ.3:
ముందరనె మొక్కే నీకు మొక్కులు
అంది నీకు నాకూటమిననె చొక్కులు
ఇందరిలోఁ గూడితివి యిట్టె శ్రీ వెంకటేశ
సందడించీఁ బాదముల సరసపు తొక్కులు