పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0166-3 దేసాళం సంపుటం: 07-389

పల్లవి:
ఏమి నీకు తమకమో యెరఁగ నేను
వాములాయ పులకలు వట్రువ నాచన్నుల

చ.1:
చేరి యాల పట్టేవు నాచేఁకట
యేరా యెంతలేదు నీయేఁకట
ఆరజము సేయకు మమ్మందరిలోన
చేరెఁడేసీ కురిసె నీచెమట నామేన

చ.2:
సూటిగానేమి చూచేవు చొక్కప్తుమోవి
తేటగానందునున్నది తియ్యనితావి
యేఁటికి రేఁచేవు సారెనిటె నాసిగ్లు
గాఁటపు నానగవులె కప్పురపు ముగ్గు

చ.3:
కందువమేలిదివో నాకాఁగిట
విందు నీసుద్దులెల్లా భావించి లోఁగిట
చెంది నీచింతలో శ్రీ వెంకటేశ
సందడినొాండొంటితో చన్నులు రాశె