పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0107-2 ముఖారి సంపుటం: 07-038

పల్లవి:
మొక్కేలేవే యిందులకు మొదల నేను
మొక్కితే దీవెనలు ముందుముందే రావా

చ.1:
చిగురుఁ జేతులకేలే చిమ్మువాఁడి కొనగోళ్ళు
చిగురుఁగొమ్మున వోరి చేఁగలే కావా
తగు తీఁగెవంటి నీకు దంటతనమింతయేలే
వెగటుతీఁగెలే కావా విఱవీఁగఁ గాచును

చ.2:
ఇంచుకంత మోమునకు యింతలేసి కన్నులేలే
యించుకంత అద్దమేరా యిన్నీఁ జూచేది
కొంచెపు నీనోరికేలే కొండలంతలు మాటలు
కొంచపు నడుమే కాదా కుచగిరులానును

చ.3:
పండువంటి మోవికేలే పచ్చిలక్కముద్రలివి
పండినపంటకే కావా బలుముద్రలు
నిండు శ్రీ వేంకటేశుఁడ నిన్నునేఁ గూడితిఁగదే
నిండు నీవురము నాకు నెలవు గాదా