పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0165-1 భైరవి సంపుటం: 07-381

పల్లవి:
చేఁతలు నీవిచూచి సిగ్గయ్యూ మాకు
కాతరమింకానెంతే కతకారి నీకు

చ.1:
నీడనుండె యలసేవు నిన్ను నీవె సాలసేవు
చేడెరో నీమగఁడు చూచీనంటాను
పాడిపాడి చొక్కేవు పలుమారు నిక్కేవు
యేడ నేరుచుకొంటివే యెమ్మెలాఁడి నీవు

చ.2:
వేసాలకే మురిసీవు వెస ముద్దుగురిసేవు
పోసరించి యాతఁడు పాగడీనంటా
ఆసలు గడు రేఁచేవు అట్టి సిగ్గులు దాఁచేవు
మాసుద్దులు వినరాదా మాయదారి నీవు

చ.3:
బొమ్మనె జంకించేవు పొందులనె లంకించేవు
కమ్మి శ్రీ వేంకటేశుఁడు కైకొనీనంటా
నెమ్మది నన్నేలినాఁడు నేనలమేల్‌ మంగను
సమ్మతించ నేరుతువే సటకారి నీవు