పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0164-6 దేశి. సంపుటం: 07-380

పల్లవి:
కొమ్మ కడకు విచ్చేసి కోరినవరమీరాదా
యెమ్మెల మానసతపమీకె చేసీని

చ.1:
వెన్నెలయెండలలోన విరహతాపానఁ జెలి
పన్ని మిక్కుటమైన తపము చేసీని
చెన్నుమీరఁ బరచిన చిగురుఁగత్తులమీఁద
యెన్నరాని వుగ్రతపమిదె చేసీని

చ.2:
మొనసి చెమటఁ దలమునుకల నీటిలోన
పనివడి నీకుఁ దపము చేసీని
ఘనమైన నిట్టూరుపు గాలి లోనఁ జెలించక
యెనలేని ఘెరతపమిదె చేసీని

చ.3:
బాయిటనె తనమేని పచ్చిజవ్వనవనాన
పాయక నీరతికిఁ దపము చేసీని
నీయింట శ్రీ వెంకటేశ నిన్నుఁగూడెలమేల్‌మంగ
యీయెడ మోహనతపమిది చేసీని