పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0164-5 పాడి సంపుటం; 07-379

పల్లవి:
విచ్చేయరాదా వెలఁదిఁ జూతువుగాని
హెచ్చిన తమకముతో నింటిలోననున్నది

చ.1:
తలఁచిన తలఁపులు తరుణియురమునను
మొలచెను మొలకలై మొగిఁ జన్నులు
వలచిన వలపులు వడియుచుఁ జెక్కులను
జలజలఁ జెమటలై జడివట్టెనిదివో

చ.2:
కోరిన కోరికలెల్లాఁ గొనసాగి శిరసున
పేరడిగాఁ బెరిగెను పెనుఁదురుమై
నేరిచిన నేరుపులు నిండా మోవితేనెయై నో
రూరఁజొచ్చె నీ సతికి నొద్దికతో నిదివో

చ.3:
ననిచిన ననుపులు నాతిని నీవు గూడగ
గొనకొనీ గోరితాకుల లతలై
అనిశము శ్రీ వేంకటాధిప యీరీతినే
దినదినమును మాకు దిష్టమాయనిదివో