పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0107-1 మధ్యమావతి సంపుటం: 07-037

పల్లవి:
ఏల వేగిరించేవీపె నిట్టెమాటలాడుమని
నాలీనాపె మోము చూచి నవ్వులేఁటికయ్యా

చ.1:
వేగినంతా నీ తోడ వెలఁది మాటలాడి
భోగించీ నిద్దురలిదె పొద్దెక్కినంతా
చేగదేరినట్టి పెక్కుచింతలు గలవాఁడవు
యీగతి నిద్దురలు నీకేల వచ్చీనయ్యా

చ.2:
పెక్కుదడవు నీతోడఁ బెనఁగినది గనక
వుక్కుననలసి కొంత వూరకున్నది
అక్కడ సాములు చేసే యలవాటు గలవాఁడ
విక్కడ నీ కింతయలపేల వచ్చె (చ్చీ ?) నయ్యా

చ.3:
తతిగొన్న నీరతులఁ దనిసినది గనుక
మతిపరవశముల మఱచున్నది
యితవై శ్రీ వేంకటేశ యీపెఁ గూడితివి నీకు
నితరకాంతలవలె నేలవుండీనయ్యా