పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0164-3 శ్రీరాగం సంపుటం: 07-377

పల్లవి:
ఇందుకుపాయము నీవు యెటుసేసేవో
యిందరిలోపల నిన్ను నేమీననకున్నది

చ.1:
అక్కడిబాగాలు దెచ్చి అతివకు నియ్యఁగాను
పక్కననొల్లననదు పట్టదు చేత
మొక్కలపుటల్క గొంత మొకదాకిరి గొంత
నిక్కముగా నీకుఁజూపి నివ్వెరగందినది

చ.2:
ఊరివారి చిల్కదెచ్చి వొడిలో నీవు వెట్టఁగా
నేరుపదు మాటలు దాని విడువదు
ఆరితేరిన సిగ్గుగొంత ఆసపాటు మరికొంత
కూరిమి లోలోఁదలఁచి గుట్టుతోడనున్నది

చ.3:
సవతుల కానికలుసంగడి నీవిడఁగాను
తివిరి కోపగించదు దిష్టించదు
యివల శ్రీ వేంకటేశ యింపుగొంత తెంపుగొంత
కవగూడి అన్నిటాను కైవసమయినది