పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0164-1 సౌరాష్ట్రం సంపుటం: 07-375

పల్లవి:
ఔనో కాదో యీతగవులడుగవే రమణుని
కానుకలెంత యిచ్చినా కంటకమై వుండును

చ.1:
మనసురానిసతి మంచిమాటలాడినాను
విని విని పతికది వెంగెమై తోఁచు
ననుపు లేనియాకె నవ్వులెన్ని నవ్వినాను
కినిసి యాతనికి కేరడమై వుండును

చ.2:
ఎరవెరవైనయాకె యిచ్చకము సేసినాను
విరసాననాతనికి వెగటై తోఁచు
పారపాచ్చెమైనయాకె పొదుగఁగ వచ్చితేను
గరిమ నాతనికిని కదిమినట్లుండును

చ.3:
వెగటైనయాపె యెంత వేడుకలు చూపినాను
యెగసక్కెపువానికి యెగ్గులైవుండు
తగు శ్రీ వేంకటేశుఁడు తానె వచ్చి నన్నుఁ గూడె
మగఁడైన యాతనికి మర్మము గరఁగును