పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0163-5 శంకరాభరణం సంపుటం: 07-373

పల్లవి:
గుట్టు చేసుకొని పతిఁ గూడి మాడి యుండరాదా
చుట్టిచుట్టి యిప్పుడెంత చొప్పులెత్తేవే

చ.1:
మొగలి రేకులు వంగి ముంగురుల జారెనంటా
యెగసక్కేలాతని నీవేలాడేవే
నగుతా నీతోడనానలు సారెఁ బెట్టుకోఁగా
సాగిసి మచ్చములేల చూపవచ్చేవే

చ.2:
కడు నోసలికస్తూరి కరఁగి మోవంటెనంటా
జడిసి యీతనివేల సాదించేవే
పడఁతుల సాకిరులు పలుమారుఁ దెలుపుకోఁగా
వెడవెడగానేల వెంగేలాడేవే

చ.3:
చెమట రేఁగి రెంటెము చిప్పిలఁ దడిసెనంటా
జమళి శ్రీ వేంకటేశు జంకించనేలే
తమితోఁ గాఁగిటఁగూడి తానె వచ్చివేఁడుకోఁగా
నెమకుచు నిట్టె యింత నీటులు చూపేవే