పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0163-2 మధ్యమావతి సంపుటం: 07-370

పల్లవి:
చెలులెల్లాఁ జూచిసంతోసించి మెచ్చి పాగడేరు
కలిగె నీకు మేలము కలకాలము

చ.1:
చెలియ నీవద్దనుండి సెలవి నవ్విన నవ్వు
వెలలేని వలపుల వెన్నెలపువ్వు
అలవోక నీమీఁదనంట జూచినచూపు
తలకొన్న జవ్వనమదము తరితీపు

చ.2:
పొంచి నీదేవులు నితోఁ బూఁచి యాడినపలుకు
వంచి తీసిన మరువాఁడిచిలుకు
అంచి నీయెదుటఁ బచరించిన సింగారము
పంచలఁ బదారువన్నె బంగారము

చ.3:
వనిత నీతోఁబెనఁగి వలలఁబెట్టిన యాస
మునుకొన్న తమితోడి ముతేల సేస
చనవిచ్చి శ్రీవెంకటేశ్వర యీకెనేలితివి
చెనకురతిమెండు చెరకునఁ బండు