పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0163-1 బౌళిరామక్రియ సంపుటం: 07-369

పల్లవి:
చిత్తగించవయ్యా యీపె చెలువములు
కొత్తలుగా మోవి చిగురు చెంగలించెను

చ.1:
జలజ లోచన నిండు జవ్వన వనములోన
మొలక నవ్వు వెన్నెల మోసులెత్తెను
వలరాజనెడి తోఁటవాఁడు పోదిసేయఁగాను
పులక జాజిననలు పూవక పూచెను

చ.2:
కాంతనెరిఁగురుల చీకటి పాదరింటిలోన
వింత తుమ్మిదగూండ్లు విరివాయను
చెంత గాలియనే తపసి నెలవైయుండఁగాను
అంతటా నానందకళాలాని నిండుకొనెను

చ.3:
సతి వలపుల పెద్ద జలజాకరములోన
తతిఁ గన్నుల మీలు చందములాయను
అతివ యలమేల్మంగ యాకె శ్రీ వెంకటేశ్వర
రతిఁగూడ మోహనమరందములు గురిసె