పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0162-6 రీతిగౌళ సంపుటం: 07-368

పల్లవి:
ఏల సిగ్గులు వడేవు యిందరిలోన
పాలిండ్లు చూపి నాపె బాఁతిపడివున్నది

చ.1:
దీకొని మోమైనాను దిట్టించి చూడరాదా
నీకు మొక్కినాపె యిట్టి నిలుచున్నది
మైకొని వూరకే మంచిమాటైనానాడరాదా
ఆకుమడిచిచ్చినాపె ఆసపడియున్నది

చ.2:
ఆనుకొని పరిణామమైన నడుగరాదా
కానుకలిచ్చినయాపె కాచుకున్నది
నానఁబెట్టి సెలవుల నవ్వైనా నవ్వఁగరాదా
పూని సన్నసేసినాపె పాలయుచున్నది

చ.3:
కొంగువట్టి రతులకు గురుతు చెప్పఁగరాదా
వుంగరమువట్టినాపె వొద్దనున్నది
చెంగట శ్రీ వెంకటేశ చేరి నన్నుఁ గూడితివి
యింగిత మెరిఁగినాపె యెదుటనే వున్నది