పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0162-5 కన్నడగౌళ సంపుటం: 07-367

పల్లవి:
ఆతనితోనేల పంతాలాడేవే నీవు
యేతరివాఁడు గుట్టుతోనెడయఁగ నేర్చునా

చ.1:
సరమాడినవాఁడుసంగడిఁ గూచుండుఁగాక
పరగ వట్టిసిగ్గులు వడునటవే
వరుసతో మాటాడినవాఁడు చెయిచాఁచుఁగాక
శిరసువంచి చింతతో చిక్కువడునా

చ.2:
మొగముచూచినవాఁడు మోహించి పైకొనుఁగాక
బిగిసి వట్టిబీరాలు పెంచునటవే
తగుల వలచువాఁడు తమకమె చూపుఁగాక
అగడైన అడియాస లణఁచఁగఁ గలఁడా

చ.3:
చేపట్టి కూడినవాఁడు చేరిమోవియిచ్చుఁగాక
చాపలాన రతులకు జడియునటే
యేపున శ్రీ వెంకటేశుఁడిట్టె నిన్నుఁగూడె నేఁడు
కాఁపురములీడేరె గరిసించనోపునా