పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0162-4 కేదారగౌళ సంపుటం: 07-366

పల్లవి:
తెలిసితి నిపుడు నీతెరఁగెల్లాను
నిలుకడతో నన్నునిట్టె మన్నించవయ్యా

చ.1:
మనసాక్కచోఁ బెట్టి మాటలాడఁబోతేను
పెనఁగులు వడుఁగాని బెంబడిరాదు
ననుచనిచోటను నంటుసేయఁ దలఁచితే
అనుమానమె కాని అమరికరాదు

చ.2:
చేతులొకతెపైఁ జాఁచి సెలవుల నవ్వితేను
కాతరమై తోఁచుఁగాని కాంక్షదీరదు
యేతరితనాలకు యెన్నియీవులిచ్చినాను
నీతులెన్నుదురు గాని నిజమని నమ్మరు

చ.3:
దిక్కులాలించుకొంటా బత్తితోఁ గాఁగిలించితేను
తక్కులందురుగాని తగులనరు
యిక్కడ శ్రీ వేంకటేశ యేలితివి నన్నునేఁడు
మక్కువలు నిండుఁగాని మరివేరుగాదు