పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0161-5 కాంబోది సంపుటం; 07-361

పల్లవి:
ఏమి సేతుఁ జెప్పవయ్యా యెందుకౌదును
వేమరు నామొగమాట విడువఁగఁ గలనా

చ.1:
చెక్కులు నొక్కితివంటా చేరి వేఁడుకొంటివంటా
పక్కన నీసతులకుఁ బంతమిత్తురా
మిక్కిలి వలపునాది మీఁద మదనుఁడు పోది
వొక్కమారు నిన్నుఁబాసి వోరువఁగఁ గలనా

చ.2:
కమ్మటి నవ్వితివంటా కన్ను గిరిపతివంటా
దొమ్మికాంతలతో డఁబొత్తు గలతురా
నమ్మితి నేనిబాస నాదే మదినడియాస
యెమ్మెలకైనా నీతో యెదురాడఁగలనా

చ.3:
సరసమాడితివంటా చనవులిచ్చితివంటా
సరివారికి మొక్కి వంచనసేతురా
గరిమ శ్రీవేంకటేశ కాఁగిలి నన్నింతసేసె
అరసి నన్నేలితివి అవుఁగాదనఁగలనా