పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0161-4 భైరవి సంపుటం: 07-360

పల్లవి:
ఇంత సేసినవాఁడవు యిదె నీవె కదవయ్యా
వింతలుగా సారెసారె విఱవీఁగీఁ దాను

చ.1:
పాలఁతి గుబ్బలమీఁది పాగడ పువ్వుల దండ
చెలఁగి యాపెకు నీవిచ్చితివి వోయి
చెలులతోఁ జెప్పుతాను చెంగటి సవతులకు
పలుమారుఁ జూపి యెమ్మె పచరించీఁ దాను

చ.2:
పెదవిపై గానవచ్చే పెద్దకప్పురపు లప్ప
అదన నీవంపితివా ఆపెకు నేఁడు
వుదుటునఁ జవిగొంటా వొద్దనుండే యింతులను
యెదుట నోరూరించి యెలయించీఁ దాను

చ.3:
అందప్తుఁ జెక్కులమీఁదనంటి బేంట్లు రాలీ
గందము వూసితివా కాంతకు నీవు
ముందె నన్నుఁగూడితివి మోహాన శ్రీ వేంకటేశ
చిందినరజములెల్లా చేతనెత్తీఁ దాను