పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0161-2 సామంతం సంపుటం; 07-358

పల్లవి:
ఇట్టుండవలదా యెనసి సంగాతము
వొట్టి వొకటొకటికొద్దికలాయ

చ.1:
కలువ రేకులే మంచి కన్నులుగాఁగా
చెలిమొగము మెరసి శశియాయ
వెలయ బొమలు మరువిండ్లుగాఁగా
నలి సంపెగవిరి నాసికమాయ

చ.2:
సతతముఁ గుచములు శైలములుగాఁగ
అతివ కరంబులు లతలాయ
తతిగొను నాభియె తగు బిలముగాఁగ
మితిమీర నడుము మృగపతియాయ

చ.3:
పాగరు జఘనము పులినము గాఁగ
మగువపదములు తామరలాయ
సాగిసి శ్రీ వెంకటేశుఁడు మగఁడుగాఁగ
తగిలినవలుపే తలపోఁతలాయ