పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0106-5 శ్రీరాగం సంపుటం; 07-035

పల్లవి:
మాపుదాఁకా వట్టిమాటలేమిటికి నిఁక
తీపులకుఁ గుఱి మోవిదిష్టంబులే

చ.1:
తలపోఁతలకును గుఱి తమకంబులే చెలియ
వలపులకు గుఱి నిండు వయసు మదమే
చలములకు గుఱి తగిన సమరతుల నిబ్బరము
పిలుపులకు గుఱిజి మంచి ప్రియములివియె

చ.2:
యెనయు నాసలకు గుఱి యెడతాఁకులే చెలియ
ననుపులకు గుఱి సెలవినవ్వులివియే
చనవులకు గుఱి మిగుల సలిగెలు మెరయుటలు
మొనయ పాందులకు గుఱి మొగమోటలే

చ.3:
జిగిఁ గలయికలకు గుఱి సిగ్గు విడుచుటె చెలియ
తగులమికి గుఱి యేకతములవునికే
తగిన శ్రీ వేంకటోత్తముఁడు ననునిటు గూడె
పాగరుమన్ననకు గుఱి భోగంబులే