పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0160-5 సాళంగనాట సంపుటం: 07-355

పల్లవి:
ఎక్కడ పరాకు యిదివో నీకు
మిక్కిలిఁ జేసితివి నమ్మినయడ మేకు

చ.1:
కలికి పొంచి నిన్నుఁ గలయ
వెలలేని వలపులు వెలయ
సులభుఁడవా నీవు సాలయ
మెలుపున నవ్వీని మేనెల్లానలయ

చ.2:
ముచ్చటతోడ మొక్కీ మొదల
కచ్చుపట్టి కుచములు గదల
పచ్చిదేరీ మదనసంపదల
మచ్చరము లేదీకెకు మాటలతుదల

చ.3:
వెక్కముగా వేసీ విరుల
చక్కఁగా దిద్ది తన సరుల
యిక్కువ శ్రీ వేంకటేశ యీకె యలమేల్మంగ
చెక్కునొక్కి నిన్నుఁగూడె చెదరినకురుల