పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0160-3 పాడి. సంపుటం: 07-353

పల్లవి:
ఎక్కడ పరాకు నీకు యిటుచిత్తగించరాదా
పక్కనఁ బలిచితేఁ జాలు బత్తిగలదానికి

చ.1:
కడనుండి రమణుఁడు కన్నులఁ జూచినఁజాలు
అడియాసఁ బొరలేటి ఆఁటదానికి
చిడిముడితోఁ గొంత సెలవుల నవ్వినఁ జాలు
యెడసియుండి రతులకేఁకరేటిదానికి

చ.2:
మలసి మగఁడేపాటి మాటలాడినాఁ జాలు
చెలరేఁగి కడు వలచినదానికి
నెలకొని ముందట నిలుచుండినాఁ జాలు
సాలసి యెట్టుయెదురు చూచేటిదానికి

చ.3:
ఇచ్చగించి నాయకుఁడు యింటికి వచ్చినాఁ జాలు
కచ్చుపెట్టి ప్రేమము గలదానికి
కొచ్చి శ్రీ వెంకటేశ కూడితివలమేల్మంగ
నిచ్చట నీవుంటేఁ జాలునింపుగలదానికి