పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0159-5 దేసాళం సంపుటం: 07-349

పల్లవి:
ఏల వెరచేవు నమ్ము యేమీననదాపె నిన్ను
తాలీమితో మాటాడేతే తప్పులన్నీఁ దీరును

చ.1:
చెలి పిలువనంపఁగా సింగారించుకొనేనంటా
యెలిమితో జరపులనేల పెట్టేవు
వెలయలేకలంపెను వేలఁ దగిలించుకొని
సాలపుల మమ్మునేమి సుద్దులడిగేవు

చ.2:
భామ నీదిక్కుచూడఁగా పనిగలవానివలె
వేమారుఁ దలవంచేవు వీదిలోనుండి
తామరగొని వేసితే తగఁజేతఁ బట్టుకొని
ప్రేమముతో మాకునెంత ప్రియాలు చెప్పేవు

చ.3:
అలమేలుమంగను అదరిపాటువలెను
కలసేవాకెను శ్రీ వెంకటేశ్వర
యెలమినెదురుచూచెనిందాఁకా నీకుఁ గాను
వెలినాకెకేమి విన్నవించకుమనేవు