పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0159-4 వసంతం సంపుటం: 07-348

పల్లవి:
ఇటులా నేముసేసేమా యిల్లాండ్లము నేము
తటుకన నీమదిలోఁ దడఁబడకిఁకను

చ.1:
యేడనైనా గయ్యాళియైనది చనవు గలితే
ఆడరానిమాఁట నిన్నాడుఁగాక
వేడుకకత్తెయినది విచారించకందరిలో
వీడెమిచ్చి కాలుఁజేయి వేసును నీమీఁదను

చ.2:
మందెమేళమైనది మరగితే నీమేన
చిందరవందరసేఁత సేయుఁగాక
అందునిందు రట్టడియైనది వెరవులేక
చెంది నీబుజాన మోము చేర్చుకొని నవ్వును

చ.3:
సారెకు దిట్టెనది సంగడిఁ బెట్టుక వుండితే
చేరి రతివేళఁ గక్కసించుఁ గాక
ఆరీతి శ్రీ వెంకటేశ అలమేల్‌మంగను నేను
కోరి నన్నునేలితివి కొంకకాపె మెచ్చును