పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0159-3 కేదారగౌళ సంపుటం: 07-347

పల్లవి:
మేలుమేలు యిందుకిట్టే మెచ్చితి నిన్ను
తాలిమితో నిన్నీరితి దక్కించుకొనెఁగా

చ.1:
మంతనాననేపాద్దు మాటలాడేవాపెతోను
ఇంత వలపించెఁగా యింతి నిన్ను
పొంతనే నీవెంగిలిపొత్తు గలపుకొంటివి
పంతాన నిందుకొగ్గించి భ్రమయించెఁగా

చ.2:
తతిగొని చూచేవు తరుణిమొకమే నీవు
బతిమాలింపించెఁ గా భామ నిన్ను
సతముగాఁ బానుపుపై జంటవాయనియ్యదు
మతిఁ దనకాఁగిలి మరగించుకొనెఁ గా

చ.3:
చెలరేఁగి విడేలకు చేతులు చాఁచేవు నీవు
అలవాటు సేసెఁగా అంగన నిన్ను
అలమేలుమంగ ఆకె అట్టె శ్రీ వెంకటేశ్వర
నలిఁ గూడితివి నీచే నన్నూ నెలిఁపించె గా