పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0159-2 మాళవిగౌళ సంపుటం: 07-346

పల్లవి:
నీకునింతి వలచుటే నీవెరఁగవా
చేకొని యీకెదిక్కు చిత్తగించరాదా

చ.1:
చెక్కునొక్కి ఆపె నిన్ను చెయివట్టి తియ్యఁగాను
యెక్కడ పరాకు సేసేవేమయ్యా నీవు
యిక్కువలు గోరనంటి యింటికిఁ బిలువఁగాను
గక్కననేమి నవ్వేవు కానిమ్మనరాదా

చ.2:
వేడుకతోడ సారెకు విందులు నీకుఁ జెప్పఁగా
ఆడేవు జూజాలిప్పుడే అదేమయ్యా
వీడెము చేతఁబట్టుక వెనక నిలుచుండఁగా
పాడితివి పాటలప్పటనుండి నీవు

చ.3:
పానుపువరచుకొని పడఁతి సన్నసేయఁగా
కానుకలందుకొనేవు కాంతలచేత
మోనాన నలమేల్‌మంగ మొక్కి నిన్నుఁ గాఁగలించె
తానకమై యేలితివింతట శ్రీ వేంకటేశ