పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0158-6 హిజ్జిజి సంపుటం; 07-344

పల్లవి:
ఇంతవాఁడవు గాఁగానే యిందరు మోహింతురు
సంతసానఁ బెలఁగుదు సరసుఁడవు నీవు

చ.1:
విరహవేళ నెంతేసి వెంగెములాడుదు నిన్ను
యెరవు లేక వోరుతువిన్నియు నీవు
సరసమాడే యప్పుడు సారెనలయింతు నేను
విరసము లేకుందువు వేడుకతో నీవు

చ.2:
కొసరేటి తరినెంత గోరనూఁదుదు నిన్న
అసముతో నవ్వుదువందుకు నీవు
పాసఁగఁ బరాకారైనచో పూబంతినివేతు నిన్ను
సుసరాన వేఁడుకొని చొక్కింతువు నీవు

చ.3:
సరిఁ గూడేయెడనెంత జంకింతు నిన్ను నేను
గరిమనెంత మెత్తువు కాఁగిట నీవు
నిరతి శ్రీవెంకటేశ నేనలమేల్‌మంగను
మరిగితి నేను కడు మన్నింతువు నీవు