పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0158-4 రామక్రియ సంపుటం: 07-342

పల్లవి:
నీవోజ నేనెరఁగనా నెపాలేల చెప్పేవు
వేవేలకు నాకు వింతవాఁడవా

చ.1:
ఎప్పుడు నామోహమోరఁగవా నీకక్కడ
కప్పి యెంతపని నీకుఁ గల్లెనోకాక
నెప్పున మాయింటికి నీవు రానివాఁడవా
అప్పటి నేచుట్టాలు మాటాడుతా నీకుండిరో

చ.2:
మలసి నన్ను నీవు మరచేటివాఁడవా
చెలులెవ్వరు పరాకుసేసిరోకాక
తలఁపు నామీఁద నీకుఁ దగిలివున్నదే కాదా
సాలసేవారిమొగాలు చూడనందుండితివో

చ.3:
వరుస నన్నుఁజేపట్టి వదలుదువా నీవు
యిరనై నీచిత్తాననేమెంచేవో కాక
నిరతి శ్రీ వేంకటేశ నేనలమేర్‌ మంగను
కరుణించితి విప్పుడు గలయ వేళాయనో